English   

ప్రతి రోజు పండగే లైవ్ రెస్పాన్స్.. సాయి తేజ్ హిట్ కొట్టాడా..

Prati Roju Pandage
2019-12-20 12:00:17

వరుసగా ఆరు ఫ్లాప్ సినిమాల తర్వాత చిత్రలహరితో ఈ ఏడాది ఫామ్లోకి వచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు అదే ఉత్సాహంలో మారుతి దర్శకత్వంలో ప్రతిరోజు పండగే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై ముందు నుంచి కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 800 థియేటర్లలో విడుదలైంది ప్రతి రోజు పండగే. యు.వి.క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సాయి ధరంతేజ్ కు జోడీగా రాశిఖన్నా నటించింది. ఇదిలా ఉంటే యుఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ భారీగా పడ్డాయి. అక్కడి నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రతి రోజు పండగే మంచి సినిమా అనే అంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మారుతి కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడని.. ఇంటర్వెల్ సీన్ అద్భుతంగా వర్కవుట్ అయిందని చెబుతున్నారు. అయితే సెకండాఫ్ లో మాత్రం ఎమోషన్స్ సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోవడంతో అక్కడక్కడ సన్నివేశాలు ఇరికించినట్లు అనిపించిందని చెబుతున్నారు యుఎస్ ఆడియన్స్. క్లైమాక్స్ మళ్లీ వర్కౌట్ అయిందని.. ఎమోషనల్ గా మారుతి మెప్పించే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది. రావు రమేష్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడని.. ఆయన సన్నివేశాలు సెకండాఫ్ లో నిలబెట్టాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇక్కడ షోలు పడిన తర్వాత ప్రతి రోజు పండగే సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి. 

More Related Stories