English   

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంట్లో సోదాలు

lav
2019-12-20 19:56:46

టాలీవుడ్ మీద జీఎస్టీ అధికారులు ద్రుష్టి సాధించారు. నిన్న హీరో విష్ణు మీద పడ్డ వారు ఈరోజు హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంపై  డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారుల దాడులు చేశారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకుంన్నట్టుగా చెబుతున్నారు. అయితే ఆమె ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో డీజీజీఐ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం. మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఖైరతాబాద్, బంజారా హిల్స్, బేగంపేట, లింగంపల్లిలోని 20 చోట్ల అధికారులు ఏక‌కాలంలో ఈ తనిఖీలు చేప‌ట్టారని అంటున్నారు. చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల్లోనూ ఉదయం నుంచి డీజీజీఐ సోదాలు చేస్తోంది. రూ.కోట్లలో సర్వీస్‌ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో వీరిపై దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే లావణ్యకు సంబంధించిన ఆస్తులపై దాడులు జరగడం ఇదే తొలిసారి. కాగా మొన్న అర్జున్ సురవరంతో విజయాన్ని అందుకున్న లావణ్య.. ప్రస్తుతం A1 ఎక్స్‌ప్రెస్ అనే చిత్రంలో నటిస్తోంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో లావణ్య హాకీ ప్లేయర్‌ పాత్రలో నటిస్తోంది.

More Related Stories