English   

మేకప్ లెస్ రకుల్ పిక్ మీరు చూశారా

rakul
2019-12-20 20:48:13

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఈ మధ్య కాస్త నెమ్మదించింది. వరస ఫ్లాపులు తగలడం కొత్త హీరోయిన్ల ఎంట్రీతో రకుల్ కు టాలీవుడ్ ఆఫర్లు తగ్గాయి. అయితే రకుల్ తమిళ హిందీ సినిమాలపై ఎక్కువగా దృష్టి సారించింది. ఈమధ్య ఒక ఫోటో షూట్ లో పాల్గొన్న రకుల్ ఈ ఫోటో కోసం రెడ్ థీమ్ ఎంచుకుంది. ఎరుపు రంగు టాప్.. షార్ట్.. జాకెట్ ధరించి అదే రంగు నేపథ్యంలో సూపర్ స్టైలిష్ గా నిలుచుంది. ఆభరణాలు గట్రా లేకుండా తక్కువ మేకప్ తో మోడరన్ బ్యూటీలా కనిపిస్తోంది. జీరో సైజ్ బ్యూటీలా కనిపించాలంటే ఏ భామకైనా గంటలతరబడి కసరత్తులు చేయడం తప్పదు. రకుల్ కూడా ఫిట్ నెస్ అంటే చెవులు కోసుకునే సెలబ్రిటీ కావడంతో ఈ ఎంతో ఫిట్ గా కనిపిస్తోంది. రియల్ లైఫ్ లో రకుల్ చాలా సింపుల్ గా ఉంటుంది. టైం దొరికితే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టే ఈ బ్యూటీ మేకప్ లేకుండా కూడా అందంగానే కనిపిస్తోంది. తాజాగా ఆమె మేకప్ లేని పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది మీరు కూడా చూసి ఆనందించండి. 

More Related Stories