English   

సిక్స్ ప్యాక్ కోసం కష్టపడుతున్న విజయ్ దేవరకొండ..

vijay
2019-12-21 07:08:40

ఒకప్పుడు హీరో అవ్వాలంటే నటన రావాలి.. డాన్స్ రావాలి అనే వాళ్లు. కానీ ఇప్పుడు వాటితో పాటు సిక్స్ ప్యాక్ కూడా ఉండాలి. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ప్రతి హీరో సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ లాంటి హీరోలు అయితే పుష్కర కాలం సిక్స్ ప్యాక్ చేసి వదిలేసారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఈ సిక్స్ ప్యాక్ కోసం తంటాలు పడుతున్నాడు. ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలకు ఆరు పలకల దేహంతో అవసరం లేదు. కానీ ఇప్పుడు పూరి జగన్నాథ్ ఫైటర్ సినిమా కోసం మాత్రం కచ్చితంగా సిక్స్ ప్యాక్ అవసరం వచ్చింది. అందుకే జిమ్ లో గంటల తరబడి కండలు పెంచుతున్నాడు అర్జున్ రెడ్డి. ప్రస్తుతం ఈయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14న లవర్స్ డే కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంతో పాటు పూరి జగన్నాథ్ ఫైటర్ సినిమాకు కూడా కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత పూరి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ఇందులో బాక్సింగ్ ఛాంపియన్ గా నటించబోతున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడు. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నాడు విజయ్. అంతేకాదు ఫైటర్ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడు. ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి జూన్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఫైటర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అనుకుంటారని ధీమాగా చెబుతున్నాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్ సినిమా డిజాస్టర్ కావడంతో కచ్చితంగా కొట్టాల్సిన పరిస్థితి పరిస్థితుల్లో పడిపోయాడు ఈ అర్జున్ రెడ్డి. అందుకే పూరీ జగన్నాథ్ సినిమా కోసం చెమటోడుస్తున్నాడు.

More Related Stories