English   

వేలు దూర్చే సందిస్తే.. ఏకంగా కాలే..

satya
2019-12-21 07:22:22

ఈ అర‌వోళ్లున్నారే.. అబ్బో మ‌హా ముదుర్లండీ బాబూ..! కాస్త సందిస్తే చాలు.. మొత్తానికే దూరిపోవాల‌ని చూస్తారు. ఏ సినిమాతోనైనా కాస్త క్రేజ్ వ‌స్తే చాలు.. ఇక వాళ్ల దండ‌యాత్ర‌ను ఆప‌డం అంత ఈజీ కాదు. ఇప్పుడు స‌త్య‌రాజ్ నే తీసుకోండి. ఈయన కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఇప్పుడు టాలీవుడ్ లో య‌మా బిజీగా ఉన్నాడు. స్టార్ హీరోల‌కు తండ్రి పాత్ర‌ల్లో మెప్పిస్తున్నాడు. బాహుబ‌లితో ఈయ‌న ఇమేజ్ ఆకాశాన్ని తాకేసింది. ఇన్నాళ్లూ స‌త్య‌రాజ్ గా ఉన్న ఈయ‌న్ని.. బాహుబ‌లి క‌ట్ట‌ప్ప చేసేసింది. తెలుగు ఆడియ‌న్స్ కు మ‌రింత చేరువ చేసింది ఈ చిత్రం.

ఇక ఇప్పుడు క‌ట్ట‌ప్ప తెలుగు ఇమేజ్ వాడుకోడానికి త‌మిళ నిర్మాత‌లు పోటీ ప‌డుతున్నారు. అలాగే తెలుగు లో కూడా మన దర్శకులు సత్యరాజ్ కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు విడుదలైన ప్రతి రోజు పండగే సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా కథ అంతా సత్యరాజ్ చుట్టూనే తిరుగుతుంది. దాంతోపాటు కార్తీ హీరోగా వచ్చిన దొంగ సినిమాలో కూడా సత్యరాజ్ కీలక పాత్ర చేశాడు. ఈ సినిమాలో కూడా ఆయన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ఒకే రోజు రెండు సినిమాలు అద్భుతమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు సత్యరాజ్. ఈయనకు ప్ర‌స్తుతం తెలుగులో మంచి ఇమేజ్ ఉంది. మొత్తానికి వేలు పెట్ట‌డానికి సందిస్తే.. ఏకంగా కాలే పెట్టేస్తున్నారు క‌దా ఈ త‌మిళ తంబిలు.

More Related Stories