English   

ప‌వ‌న్ కళ్యాణ్ ను చూసి ఏడుస్తున్న స్టార్స్..

pk
2019-12-21 07:34:14

తెలుగు ఇండస్ట్రీలో ప‌వ‌ర్ స్టార్ అనేది ఓ సంచ‌ల‌నం. అభిమానుల‌కు కూడా ఈ పేరు తార‌క‌మంత్రం. హిట్టు ఫ్లాపుల‌తో ప‌నిలేని ఇమేజ్ ఆయ‌న సొంతం. సినిమాలు చేసినా చేయకపోయినా రాజకీయాల్లో గెలిచిన ఓడిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ మాత్రం అలాగే ఉంటుంది. ఎవరో ఒకరికి వచ్చే అదృష్టం ఇది. సాధార‌ణంగా హిట్ల‌ల్లో ఉన్న హీరోల సినిమాల‌కు బిజినెస్ ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మాత్రం దాంతో సంబంధం లేదు. ఈయ‌న గ‌త సినిమాలు స‌ర్దార్, కాట‌మ‌రాయుడు, అజ్ఞాతవాసి డిజాస్ట‌ర్లుగా నిలిచినా.. ఇప్పుడు ఇంకా మొదలు కానీ పింక్ సినిమా రీమేక్ బిజినెస్ మ‌ళ్లీ రికార్డ్ స్థాయిలో జ‌రుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా చెప్పుకునే వాళ్ళు అందరి కంటే పవన్ కళ్యాణ్ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇదే ఇప్పుడు కొంద‌రు హీరోల‌కు నిద్ర లేకుండా చేస్తుంది. అస‌లు తాము హిట్ల‌ల్లో ఉన్నా కూడా అంత రేట్ ఇవ్వ‌డానికి ముందుకు రావ‌ట్లేదు.. కానీ ప‌వ‌న్ ఫ్లాపుల్లో ఉన్నా కూడా అంతలా ఎలా ఇస్తున్నార‌ని జుట్టు పీక్కుంటున్నారు. పైగా ఈయన రీ-ఎంట్రీ సినిమాకు ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు అని లెక్కలు వేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కు అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ సినిమా అంటే కచ్చితంగా 100 కోట్లకు పైగా బిజినెస్ ఖాయం. ఇప్పుడు పింక్ సినిమా రీమేక్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ వచ్చి జాయిన్ కానున్నాడు. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు.

More Related Stories