English   

త్రివిక్రమ్ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తాడా..

tri
2019-12-21 08:05:56

ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. కొన్నిసార్లు కొన్ని అనుమానాలు జరిగే పరిస్థితులను బట్టి కూడా వస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. రాజకీయాల్లోకి వెళ్లినంత మాత్రాన పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలకు దూరం కాలేదు. మధ్య మధ్యలో తనకు కావాల్సిన సినిమా వేడుకలకు వస్తున్నాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వస్తున్నాడు. వైజాగ్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగబోతుంది. ఈ సినిమా దర్శకుడు కూడా పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దాంతో అల వైకుంఠపురంలో ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తాడని ముందునుంచే ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. మాటల మాంత్రికుడుకి అత్యంత సన్నిహితుడైన పవన్ కళ్యాణ్ కాకుండా ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ రానుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అయితే అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ మంచి స్నేహితుడు. ఇద్దరూ బావా బావా అని పిలుచుకుంటారు. దానికి తోడు గతేడాది అరవింద సమేత లాంటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ కు ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ స్నేహంతోనే ఇప్పుడు బన్నీ సినిమా ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తున్నారు అల వైకుంఠపురంలో చిత్ర నిర్మాతలు. ఒకవేళ ఎన్టీఆర్ వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ కూడా వస్తాడనే ప్రచారం జరుగుతుంది. మరి ఆయన వస్తాడా రాడా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్, త్రివిక్రమ్ మధ్య మనస్పర్థలు వచ్చాయని కొన్ని వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే తామిద్దరం ఎప్పటికీ మంచి స్నేహితులం అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పడంతో అందరికీ మంచి క్లారిటీ వచ్చేసింది. మాటల్లో కాకుండా ఇప్పుడు ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి చేతల్లో కూడా పవన్ కళ్యాణ్ నిరూపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.

More Related Stories