English   

హీరోయిన్ తో బ్రేకప్..మరో అమ్మాయిని పెళ్లి చేసుకోనున్న హీరో 

Anjali jai
2019-12-21 12:23:42

హీరోయిన్ అంజలి – హీరో జై లు కొంతకాలం సహజీవనం చేశారని తమిళ మీడియా చెబుతుండేది. తాజాగా మాత్రం ఆ ఇద్దరూ విడిపోయినట్లు ప్రచారం చేస్తోంది. జర్నీ చిత్రంలో నటించిన సమయంలో అంజలి – జై ల మధ్య ఎఫైర్ మొదలయ్యింది, ఆ సినిమా తర్వాత ప్రేమలో పడిన ఈ ఇద్దరు కూడా ఒకే అపార్ట్ మెంట్ లో ఉంటూ సహజీవనం చేస్తున్నారని ప్రచారం జరిగేది. 

ఇటీవలే బెలూన్ చిత్ర నిర్మాత ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ఒకే గదిలో సహజీవనం చేశారని షూటింగ్ కు సైతం డుమ్మా కొట్టి తిరిగారని సంచలన వ్యాఖ్యలు చేయడంతో వారి సహజీవనం కథనాలకు మరింత బలం చూకూరింది. అంజలి విషయంలో సెట్స్ లో అందరూ మేడం మేడం అంటూ నడుచుకోవాలని లేదంటే మర్యాదగా ఉండండని హీరోగారు వార్నింగ్ లు ఇచ్చేవాడని సదరు నిర్మాత పబ్లిక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.

తాజాగా వీటన్నింటిపై జై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అంజలితో ప్రేమ ఎఫైర్ అన్నీ ఒట్టిదే అని పేర్కొన్నారు. త్వరలోనే నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నా. అంజలితో నా ప్రేమ నిజమో అబద్దమో అప్పుడే మీకే అర్ధమవుతుందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై ఈ భామ తొలిసారి నోరు విప్పింది. జైకి తనకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అంజలీ  అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘నిశ్శబ్దం’లో ఆమె పోలీస్‌ అధికారిణిగా దర్శనమివ్వబోతుంది. అలాగే పవన్‌ కల్యాణ్ రీ ఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌లో కీలక పాత్రను పోషించబోతున్నట్లు చెబుతున్నారు.

More Related Stories