చేతులు మారి రెండు పార్ట్స్ గా తెరకెక్కనున్న నితిన్ సినిమా

ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు నితిన్. తాజాగా మరో సినిమాని ఆయన అంగీకరించినట్టు చెబుతున్నారు. నితిన్ కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించబోయే సినిమాకి ‘పవర్ పేట’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2020 వేసవిలో ప్రారంభంకానున్నదని చెబుతున్నారు. ఈ సినిమాని ముందు నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్‌లో నిర్మించాలనుకున్నారు. అయితే ఏమయిందో ఏమో ఆ ప్రాజెక్ట్ సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాతల వద్దకు వెళ్లింది. అప్పటికే నితిన్ తో `భీష్మ` సినిమాని నిర్మిస్తున్నారు. దాంతో `పవర్‌పేట` ప్రాజెక్ట్ అక్కడి నుంచి మళ్ళీ చ్తులు మారి పీపుల్ మీడియా వారి దగ్గరికి చేరింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ప్రస్తుతం నితిన్ తన తాజా చిత్రం `భీష్మ` కోసం రోమ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం రోమ్‌లో కీలక సన్నివేశాలతో పాటు పాటల్ని చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా వుంటే నితిన్ మరో మూడు చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇవి కూడా చిత్రీకరణ దశలో వున్నాయి.