English   

ఇచ్చట వాహనములు నిలపరాదు అంటున్న సుశాంత్

Sushanth
2019-12-21 12:50:11

వరుస పరాజయాల తర్వాత సుశాంత్ ఇటీవలే ‘చి.ల.సౌ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో తన తర్వాత సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ అక్కినేని గ్రూప్ హీరో. ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ హీరో మరో సినిమా ప్రకటించాడు. తన తర్వాత సినిమాకు సంబంధించిన అప్ డేట్ కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేశారు. తన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్ ను.. సినిమా నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల వివరాల్ని ఈ ఉదయం 10 గంటల 35 నిమిషాలకు ప్రకటిస్తానని చెప్పిన ఈయన తన తదుపరి సినిమా "ఇచ్చట వాహనములు నిలపరాదు" అనే టైటిల్ ప్రకటించాడు. అలాగే ఈ సినిమాలో నటించే నటీనటులు కొందరిని కూడా ప్రకటించాడు. ఈ సినిమాని కొత్త నిర్మాతలు రావో శంకర్, హరీష్ నిర్మించనుండగా దర్శన్ దర్శకత్వం వహించనున్నారు. మైనా సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించనున్నాడు. ప్రియదర్శి, అభినవ్ గోమతం, వెన్నల కిషోర్ నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్ ని ఎవరూ అనేది ఇంకా ప్రకటించలేదు.
 

More Related Stories