ఆర్ఆర్ఆర్ అప్డేట్...ఆమె షూటింగ్ పూర్తయిందట

బాహుబలి సినిమా తర్వాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. కిందటే డాది నవంబర్‌లో షూటింగ్ మొదలయిన ప్రారంభమైన ఈ సినిమా సంవత్సరం పూర్తిచేసుకుంది. అయితే, ఆర్ఆర్ఆర్ మూవీ అప్డేట్స్ కోసం ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ మధ్యనే ఎన్టీఆర్ హీఒర్యిన్ సహా ముగ్గురు విలన్స్ ని కూడా పరిచయం చేశారు. ఈ సినిమాలో ప్రధానమైన విలన్ పాత్ర లేడీ స్కాట్. ఈ పాత్రలో ప్రముఖ ఐరిష్ నటి అలిసన్ డూడీ నటిస్తున్నారు. మోడల్ నుంచి నటిగా మారిన ఈ 53 ఏళ్ల ఐరిష్ భామ పలు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. అలాగే, పలు టీవీ సిరీసుల్లోనూ నటించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ద్వారా ఇండియన్ సినిమాకు పరిచయం అవుతున్నారు. ఈమె లీడ్ విలన్ స్కాట్‌కు భార్య కావచ్చు. తాజాగా ఆమె తన పాత్ర షూటింగ్ పూర్తి చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించాడు. ఆమె క్యాప్ తో ఆడుకుంటున్న మూడు సెకన్ల వీడియో షేర్ చేసిన దానయ్య ఆ విషయాన్ని ప్రకటించాడు.