English   

నిన్న లావణ్య నేడు యాంకర్‌ సుమ, అనసూయ

suma
2019-12-21 20:10:52

సెలబ్రిటీలకు జీఎస్టీ సెగ తగిలింది.హైదరాబాద్‌లోని పలు సంస్థల్లో కేంద్ర జీఎస్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కేంద్ర జీఎస్టీ నిఘా విభాగం బృందాలు మొత్తం 23 ప్రాంతాల్లోని స్థిరాస్తి, చిత్రరంగం, మీడియా, చిట్‌ ఫండ్‌, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, నిర్మాణ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించాయి. కోట్ల రూపాయల్లో జీఎస్టీ ఎగవేసినట్లు పలు సంస్థలు, వ్యక్తులపై ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని సినీనటి లావణ్య త్రిపాఠి, యాంకర్‌ సుమ, అనసూయ భరద్వాజ్‌ నివాసాల్లో సోదాలు జరిగాయి.  సినీ ప్రముఖుల ఇళ్లతో పాటు నగరంలోని చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, భవన నిర్మాణ సంస్ధలు, సాఫ్ట్‌వేర్‌ సంస్ధలు ఇలా ఏకకాలంలో 23 కంపెనీల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. కొన్ని సంస్థల్లో లావణ్య త్రిపాఠి, సుమ, అనసూయ పెట్టుబడులు పెట్టారని.. ఆ సంస్ధలపై సర్వీస్‌ ట్యాక్స్‌, జీఎస్టీ ఎగ్గొట్టిన ఆరోపణలున్నాయి. సాధారణంగా సినీ నటులు వ్యక్తిగతంగా  సర్వీస్‌ ట్యాక్స్‌, జీఎస్‌టీ చెల్లించే నిబంధనలు ఉండవు. వీరి భాగస్వామ్యం ఉన్న సంస్థలు గతంలో సర్వీస్‌ ట్యాక్స్‌, ఇప్పుడు జీఎస్‌టీని చెల్లించాల్సి ఉంటుంది.

 

More Related Stories