English   

ప్రమోషన్‌లో సరిలేరు నీకెవ్వరు.. ట్రైన్‌పై మహేష్ పోస్టర్స్..

train
2019-12-21 20:51:08

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది. మహేష్ కూడా ఈ చిత్రంలో భాగస్వామిగా ఉన్నాడు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు కూడా పర్లేదనే రెస్పాన్స్ వచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. విడుదలకు మరో నెల రోజుల కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ లో వేగం పెంచేసారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. ట్రైన్ ప్రమోషన్స్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు.. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే రైళ్ళపై పోస్టర్స్ ప్రమోట్ చేస్తున్నారు సరిలేరు నీకెవ్వరు టీం. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో 39 నిమిషాల ట్రైన్ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందని ప్రచారం జరుగుతుంది. పటాస్ నుంచి మొదలు పెట్టి నిన్నమొన్నటి ఎఫ్2 వరకు వరస విజయాలతో దూసుకుపోతున్నాడు అనిల్. దాంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తుంది. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నాడు.

More Related Stories