English   

చిరంజీవికి మళ్లీ రాజకీయాలపై ఆసక్తి పుట్టిందా..

chiru
2019-12-22 07:24:00

ఇప్పుడు ఇండస్ట్రీలో దీనిపైనే చర్చలు జోరుగా జరుగుతున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన మెగాస్టార్.. ఇప్పుడు మళ్లీ అటు వైపు అడుగేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అందులోనూ అధికార పార్టీలో ఆయన అడుగు పెట్టబోతున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య ముఖ్యమంత్రి జగన్ తో మీటింగ్ కూడా భవిష్యత్తులో రాజకీయ లబ్ధి కోసమే అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో స్టూడియో కట్టడానికి స్థలంతో పాటు జగన్ అనుమతి కోసం చిరు ప్రత్యేకంగా భేటీ అయ్యాడని ప్రచారం కూడా జరిగింది. అక్కడికి వెళ్లిన వెంటనే జగన్ కుటుంబం చిరంజీవి దంపతులను మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చిన వెంటనే జగన్ కు శాలువా.. భారతికి చీర ఇచ్చారు చిరు దంపతులు. ఆ తర్వాత జగన్ ఆథిత్యాన్ని స్వీకరించారు.

ఈ భేటీలో ముఖ్యంగా స్టూడియో నిర్మాణం గురించి చర్చకు వచ్చిందని.. దానికి మీ పర్మిషన్ కావాలంటూ జగన్ ను చిరు కోరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికితోడు చిరంజీవి వైసీపీలోకి వెళ్లబోతున్నాడని ప్రచారం కూడా జరుగుతుంది. ఈయనకు రాజ్యసభ సీట్ ఆఫర్ చేసారని.. ఇంకా చిరు వైపు నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే రాలేదని తెలుస్తుంది. కానీ జగన్ మాత్రం ఎలాగైనా తన పార్టీలోకి మెగాస్టార్ ను తీసుకోవాలని చూస్తున్నాడు. ఆయన నిర్ణయం కోసం వేచి చూస్తున్నాడు. ఇక ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో కూడా చిరంజీవి జగన్ కు సపోర్ట్ చేయడంతో వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అందుకే చిరు మీటింగ్ కోసం అడిగిన వెంటనే జగన్ కూడా నో అనకుండా అప్పట్లో అప్పాయింట్మెంట్ ఇచ్చేసాడు. మొత్తానికి చూడాలిక చిరంజీవి మనసు మళ్ళీ రాజకీయాల వైపు వస్తుందో లేదో..

More Related Stories