English   

బాలకృష్ణకు వెరీ బ్యాడ్ ఇయర్..ఈ ఏడాది హ్యాట్రిక్ ఫ్లాపులు..

nbk
2019-12-22 07:48:46

2019 బాలకృష్ణ పెద్దగా కలిసి రాలేదు. ఏడాది మొదట్లో డిజాస్టర్ సినిమాలతో మొదలు పెట్టిన బాలయ్య చివర్లో కూడా మరో ఫ్లాప్ సినిమా ఇచ్చాడు. దాంతో ఈ ఏడాది పూర్తిగా మూడు సినిమాలతో దారుణంగా నిరాశపరిచాడు నందమూరి బాలకృష్ణ. తాజాగా విడుదలైన రూలర్ సినిమాకు కూడా డివైడ్ టాక్ వచ్చింది. కనీసం మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమా వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక అభిమానులు కూడా బాలకృష్ణ స్టోరీ సెలక్షన్ పై అసంతృప్తిగా కనిపిస్తున్నారు. తమిళనాట పట్టించుకోని ఒక దర్శకున్ని బాలకృష్ణ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా చాలా తక్కువ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. బాలకృష్ణ గత సినిమాలతో పోలిస్తే ఇది పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మొదట్లోనే ఎన్టీఆర్ బయోపిక్ చేసి చేతులు కాల్చుకున్నాడు బాలకృష్ణ. భారీ అంచనాలతో వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు అత్యంత దారుణంగా నిరాశపరిచాయి. క్రిష్ తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు అభిమానులను కూడా అలరించలేకపోయాయి. కేవలం భజన చేయడానికి మాత్రమే ఎన్టీఆర్ బయోపిక్ తీశారు అంటూ విమర్శలు మూటగట్టుకున్నారు బాలకృష్ణ. కథానాయకుడు కనీసం 20 కోట్ల కలెక్షన్లు తీసుకొస్తే మహానాయకుడు అత్యంత దారుణంగా 3 కోట్లు వసూలు చేయలేకపోయింది. ఇలా మొత్తానికి 2019 బాలకృష్ణకు త్వరగా మరిచిపోయే చేదు ఏడాదిగా మిగిలిపోయింది. రాజకీయంగా కూడా ఆయన పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది.

More Related Stories