English   

హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్.. పోలీసులకు దొరికిన హీరోయిన్..

sex
2019-12-22 10:55:39

హైదరాబాద్ అంటేనే ఉపాదికి కేరాఫ్ అడ్రస్. కొన్ని కోట్ల మంది వచ్చి ఇక్కడ జాబ్స్ చేస్తున్నారు. కానీ అదే క్రమంలో కొన్ని అసాంఘీక కార్య కలాపాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యభిచారం, సెక్స్‌కు అడ్డాగా మారిపోతుంది హైదరాబాద్. తాజాగా ఇక్కడ మరో సెక్స్ రాకెట్ బయటపడింది. మొన్నటికి మొన్న ఓ టాలీవుడ్ నటి వ్యభిచార గుట్టు రట్టైంది. ఇప్పుడు మరో సెక్స్ రాకెట్ కూడా బయటికి వచ్చింది. బేగంపేటలోని ఓ పబ్‌లో వ్యభిచార దందా గురించి తెలిసి కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే బంజారాహిల్స్ లోని ఓ హోటల్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. అక్కడి ప్రముఖ హోటల్‌లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్‌ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు సడన్ రైడ్ చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఓ బడా బాబు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక హీరోయిన్ తో పాటే ఓ సీరియల్ నటి.. ఈవెంట్ మేనేజర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది.

వాళ్ల వివరాలను గోప్యంగా ఉంచారు పోలీసులు. బాలీవుడ్‌లో కొన్ని పెద్ద సినిమాల్లో కూడా నటించిన ఈ హీరోయిన్ కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటూ ఇక్కడ బడా బాబులతో ఎంజాయ్ చేస్తుందనే విషయం తెలుసుకున్న పోలీసులు మాటేసి మరీ హోటల్ పై రైడ్ చేసారు. హోటల్స్‌లో ఇలా వ్యభిచారం చేయిస్తూ గతంలో కూడా కొందరు ఈవెంట్ మేనేజర్స్ అడ్డంగా దొరికిపోయారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో వెలిగిపోదామని వచ్చిన అమ్మాయిలకు వలేసి కొందరు వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. మొన్నటికి మొన్న కూడా టాలీవుడ్ నటి ఒకరు హైదరాబాద్‌లో వ్యభిచార ఈవెంట్ నడిపిస్తూ దొరికేసింది. ఇప్పుడు మరోసారి ఇదే కథ జరుగుతుంది. సెక్స్ రాకెట్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తుండటంతో .. వారిని పట్టుకోవడం పోలీసులకు కూడా ఛాలెంజింగ్‌గా మారుతుంది. హీరోయిన్ అడ్డంగా దొరికిపోవడంతో ఆమెకు ఉన్న ఆఫర్స్ కూడా అన్నీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది.

More Related Stories