రూలర్ సినిమా సెకండ్ డే కలెక్షన్స్

నందమూరి బాలకృష్ణ హీరోగా రిలీజయిన తాజా చిత్రం రూలర్. పక్కా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సీ కళ్యాణ్ నిర్మించాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వచించిన ఈ సినిమాలో భూమిక, జయసుథ, ప్రకాష్ రాజ్, నాగినీడు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రూలర్‌కు మొదటి అట నుంచే డిజాస్టర్ టాక్ వచ్చింది. లాజిక్ లేని సీన్స్, బాలయ్య రెండో లుక్ మీద బాగా నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు మంచి వసూళ్లను రాబట్టాడు బాలకృష్ణ. తొలి రోజు ఈ సినిమా దాదాపు 5 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. నెగెటివ్ టాక్ ఉన్నా థియేటర్లు కళకళలాడాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సినిమాకు కలిసొచ్చాయి. కానీ రెండో రోజు రూలర్ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. తొలి రోజు 5 కోట్లు వసూళ్లు చేసిన రూలర్, రెండో రోజు మూడు కోట్ల మార్క్‌ను కూడా దాటలేక పోయింది. ఈరోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే బాలయ్య సినిమాకు మరోసారి భారీ నష్టాలు తప్పవంటున్నారు విశ్లేషకులు. దొంగ, ప్రతిరోజు పండగే సినిమాలు బాగుండడంతో ఈ సినిమాకి దెబ్బే అని అంటున్నారు విశ్లేషకులు.