English   

ఆర్ఆర్ఆర్ వాయిదా...మరో బాంబ్ వేసిన జక్కన్న

rrr
2019-12-22 11:18:15

‘మత్తు వదలరా’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమౌళి అన్న ఇప్పటి దాకా ఆయన ప్రతి సినిమాకి సంగీతం అందించే సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతున్న ‘మత్తు వదలరా’ సినిమాకి నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో భాగంగా ఈ ఈవెంట్‌ కు రాజమౌళిని ముఖ్య అతిథిగా ఆహ్వానించగా ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రితేష్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ సమర్పించిన ఈ సినిమాకి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతదర్శకుడు. ఈ వేడుకలో పాల్గొన్న రాజమౌళి మరో షాక్ ఇచ్చాడు. అదేంటంటే చిన్న సినిమా అయిన ఈ సినిమానే బయటకు రావడానికి ఏడాది పట్టిందని అలాంటిది తాను మూడు సంవత్సరాలు పట్టినా తప్పు లేదని చెప్పుకొచ్చాడు. దానికి పక్కనే ఉన్న యాంకర్ సుమ అవును తప్పేముంది ? మూడేళ్ళు పట్టినా ఇబ్బంది లేదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో మెగా, నందమూరి అభిమానులు టెన్షన్ లో పడిపోయారు. ఎందుకంటే ఇప్పటికే ఆ సినిమా లేట్ అవుతుందేమో అనే టెన్షన్ లో ఉండగా రాజమౌళి మరో బాంబ్ వేశాడని భయంలో ఉన్నారు. చూడాలి మరి ఇది ఎంత దూరం వెళ్తుందో ?

More Related Stories