English   

చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య మళ్లీ రాజకీయ విభేదాలు..

chiru
2019-12-22 11:30:59

అదేంటి.. మాట్లాడితే అన్న‌య్యే దేవుడు అంటాడు క‌దా.. అలాంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు చిరంజీవి మాట దాటుతాడు.. ఎందుకు విభేదిస్తాడు అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు నిజంగానే చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ విభేదాలు మళ్ళీ బయటపడుతున్నాయి. కొన్ని రోజులుగా చిరంజీవి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి జగన్ మూడు రాజధానుల విషయంపై ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడటంతో ఒక్కసారిగా మళ్ళీ రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల విషయంలో జగన్ కు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు. నాలుగు భవనాలు, నాలుగు రోడ్లు వేస్తే రాజధాని అయిపోదు జగన్ గారు ఆయనపై మండిపడుతున్నారు జనసేన అధ్యక్షుడు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి జగన్కు సపోర్ట్ చేయడంతో మెగా కుటుంబంలో చీలిక వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా ఇద్దరు ఒకరికి ఒకరు ప్రాణంగా ఉన్న కూడా రాజకీయం మాత్రం తమ్ముడితో ఏకీభవించలేకపోతున్నాడు చిరంజీవి.

రాజకీయంగా తమ మధ్య విభేదాలు ఉన్నాయని ఇంతకుముందే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు. అప్పట్లో కూడా ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు చిరంజీవికి దూరంగా ఉన్నాడు. చాలా రోజుల పాటు వీళ్లిద్దరి మధ్య విభేదాలు తగ్గలేదు అంటూ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరం ఒకటే అంటూ చిరంజీవి చెప్పాడు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన తర్వాత ఏ రోజు కూడా చిరంజీవి వచ్చి ప్రచారం గాని బహిరంగంగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ కానీ చేయలేదు. తమ్ముడు కాబట్టి గెలవాలి అని కోరుకున్నాడు. ఇక ఇప్పుడు వైయస్ జగన్ కు చిరంజీవి సపోర్ట్ చేస్తుండటంతో పవన్ కళ్యాణ్ కి పెద్ద షాక్ తగులుతుంది. జగన్ కోసం అని మెగా బ్రదర్స్ ఇప్పుడు విడిపోయారు. పవన్ కళ్యాణ్ వైపు నాగబాబు ఉంటే చిరంజీవి ఒక్కడే అటువైపు ఉన్నాడు. ఏదేమైనా కూడా రాజకీయంగా దూరంగా ఉన్న చిరంజీవి మళ్ళీ అటువైపు వస్తుండటంతో మెగా అభిమానులు కంగారు పడుతున్నారు.

More Related Stories