English   

మొదలు పెట్టింది వెంకటేష్.. పూర్తి చేసింది కూడా వెంకటేష్..

venky
2019-12-22 11:48:58

అర్థం కాలేదు కదా.. కొంతమందికి కొన్ని సంవత్సరాలు కలిసొస్తాయి. ఇప్పుడు వెంకటేష్ కు కూడా 2019 బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం రెండు సినిమాలు చేశాడు ఈ సీనియర్ హీరో. రెండూ కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే మెప్పించాయి. 2019 సంక్రాంతికి ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వెంకటేష్. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఏకంగా 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సంక్రాంతి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే వెంకటేష్ కెరీర్లో కూడా ఎఫ్ 2 సినిమా పెద్ద విజయంగా అగ్రస్థానంలో నిలిచింది. ఏడాది చివర్లో మళ్ళీ వెంకీమామ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సీనియర్ హీరో. ఇది కూడా మల్టీ స్టారర్ కావడం విశేషం. ఎఫ్ 2లో వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తే వెంకీ మామలో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి కెమిస్ట్రీ పండించాడు వెంకటేష్.

బాబీ తెరకెక్కించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి తీసుకొస్తుంది. తొలి వారం దాదాపు 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది వెంకీ మామ. మరో ఐదు కోట్లు తీసుకొస్తే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వస్తుంది. ఈ వారం వచ్చిన సినిమా లన్ని యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో రెండోవారంపై ఆశలు పెట్టుకుంది వెంకీమామ టీం. ఆ 5 కోట్లు ఈ వారం వసూలు చేసి మరో విజయం అందుకోవాలని చూస్తున్నాడు వెంకటేష్. ఏదేమైనా కూడా ఒక సీనియర్ హీరో ఒకే ఏడాది రెండు సినిమాలతో వచ్చి రెండు విజయాలు అందుకోవడం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. దాంతో వెంకటేష్ కు 2019 తీపి గుర్తులను మిగిల్చింది.

More Related Stories