English   

రాజమౌళికి చేరువగా వెళ్తున్న కొరటాల శివ..

rajamouli
2019-12-22 12:14:11

తెలుగు ఇండస్ట్రీలో అపజయం అంటూ ఎరుగని దర్శకుడు రాజమౌళి. ఒకటి రెండు కాదు ఏకంగా 12 సినిమాలు చేస్తే అన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇంత సక్సెస్ రేటు దర్శకుడు ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎవరూ లేరు. బాహుబలి సినిమాతో క్రేజ్ ఆకాశానికి చేరిపోయింది. ఒక్క సినిమా కోసం వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిపోయాడు రాజమౌళి. బాహుబలి సినిమాకు ఏకంగా 40 కోట్ల వరకు ఆయన పారితోషికం అందుకున్నాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ కూడా రాజమౌళికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం చిరంజీవి సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం కొరటాల శివ ఏకంగా 20 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి అగ్ర దర్శకులు కూడా 15 కోట్ల వరకు తీసుకుంటుంటే కొరటాలకు మాత్రం 20 కోట్లు ఎందుకు అని అనుమానం రావచ్చు. దీని వెనుక చాలా కారణాలున్నాయి. భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల శివకు బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి.

ఈ సినిమా విడుదలై కూడా దాదాపు ఏడాదిన్నర గడిచిపోయింది. కానీ ఆ అవకాశాలు అన్నీ వదులుకొని చిరంజీవి కోసం కధ సిద్ధం చేసి ఇన్ని రోజులుగా వేచి చూస్తూనే ఉన్నాడు. దాంతో అవన్నీ లెక్క వేసుకొని ఈ సినిమా కోసం కొరటాల శివకు ఏకంగా 20 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఖాళీ సమయాన్ని కూడా మెగాస్టార్ లెక్కకట్టి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చిరంజీవితో సినిమా ఓకే అయిన తర్వాత నెల నుంచి ప్రతి నెల దాదాపు 7 లక్షల వరకు కొరటాల శివకు ఖర్చుల నిమిత్తం మెగా కాంపౌండ్ నుంచి వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. అలా రెమ్యూనరేషన్ విషయంలో రాజమౌళి తర్వాత స్థానాన్ని కైవసం చేసుకున్నాడు కొరటాల శివ. చిరంజీవి సినిమా డిసెంబర్ 26 నుంచి మొదలు కానుంది. జనవరిలో మెగాస్టార్ సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు.

More Related Stories