English   

ప్రభాస్ కి చరణ్ సలహా...అందుకే షూట్ ఆపేశారా

 Ram Charan
2019-12-22 14:20:21

టాలీవుడ్ లో ప్రభాస్ ఇప్పుడు క్రేజీయస్ట్ హీరో అయిపోయాడు. బాహుబలి తర్వాత టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్ దాటి ఎక్కడికో వెళ్ళింది. అయితే బాహుబలి తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మంచి వసూళ్లు రాబట్టినా టాక్ మాత్రం ఈ సినిమా ఫ్లాప్ గా నిలబెట్టిందని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. 

అయితే ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న సమయంలో సాహో విడుదలై నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమా కథలో కూడా కొన్ని మార్పులు చేయాలని భావించి షూటింగ్ ఆపేశారు. ఇప్పుడు కధా పరంగా అన్ని సవ్యంగా ఉండడంతో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లోని ఒక స్టూడియోలో భారీ సెట్స్ వేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారని అంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ భారీ సెట్స్ కు సంబంధించి ప్రభాస్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సలహా ఇచ్చారట. 

అదేంటంటే భారీ సెట్స్ వేయడానికి స్టూడియోస్ కంటే ప్రైవేట్ ప్రాపర్టీ అయితేనే అనుకూలంగా ఉంటుందని దీని వల్ల ఖర్చు కలిసిరావడమే కాక సెట్ బయటకు లీక్ కాకుండా ఉంటుందని చెప్పుకోచ్చాడట ఈ విధంగానే సైరా ఖర్చులు తగ్గించుకున్నామని ప్రభాస్ కి రామ్ చరణ్ సలహా ఇచ్చాడట. ఇక ఎటూ ఈ సినిమా గోపీ కృష్ణా మూవీస్ అనే కృష్ణం రాజు బ్యానర్ లోనే తెరక్కేకుతుండగా పెదనాన్నకు ఖర్చు తగ్గించే పనిలో పడ్డాడట ప్రభాస్. హైదరాబాద్ నగర శివారు తెల్లాపూర్ సమీపంలో కొన్ని ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకొని చిత్ర బృందం భారీ సెట్లు వేయాలని ప్లాన్ చేశారట.

More Related Stories