English   

ఫైటర్ లో విలన్ గా యంగ్ హీరో 

Karthikeya
2019-12-22 14:42:37

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వరల్డ్ ఫేమస్ లవర్' సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా చేయనున్నాడు. ఇస్మార్ట్ శంకర్‌ సినిమాతో సూపర్‌ హిట్ కొట్టిన పూరి మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఫైటర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ నటించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం కీలకమైన పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడని అంటున్నారు. అయితే అది ప్రత్యేకమైన పాత్రనా? లేదంటే విలన్ పాత్రనా? అనే దాని మీద స్పష్టత రావలసి వుంది. 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాలో కార్తికేయ విలన్ గా మంచి మార్కులు కొట్టేశాడు. అలాగే అజిత్ సినిమాలో కూడా ఆయనను విలన్ గా తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక అందుకే 'ఫైటర్' సినిమాలోను ఆయన విలన్ గా కనిపించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

More Related Stories