సూపర్ స్టార్ చెల్లెలిగా మహానటి

సంక్రాంతి కానుకగా జనవరి 9న దర్భార్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న రజనీకాంత్ తన 168వ చిత్రాన్ని కూడా ఇటీవలే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్లో జరగనుందని అంటున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా రజనీ రాజకీయాలకు కూడా ఉపయోగపదేలాగా వ్యవసాయం మీద ఉండనుందని అంటున్నారు. ఇందులో నటి కుష్భూ, మీనాలతో పాటు నటి కీర్తీసురేశ్ నటిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారా అనే సందేహాలు ఏర్పడుతున్నాయి. ఈ విషయంలో తాజాగా కొంచెం క్లారిటీ వచ్చింది. ఇందులో రజనీకి భార్యలుగా నటి కుష్భూ, అలాగే మరో నటి మీనా నటిస్తున్నారని, నటి కీర్తీసురేశ్ ఆయనకు చెల్లెలిగానూ నటిస్తున్నట్లు చెబుతున్నారు. నటి కీర్తీసురేశ్ సరసన నటించబోయే నటుడు ఎవరా అనే అనుమానాలు మొదలయ్యాయి. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని 2020లో సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.