హీరోయిన్ తో బ్రేకప్...మతం మార్చుకున్న హీరో

ఈమధ్య తన ప్రేమ, పెళ్లి కామెంట్స్ తో వార్తల్లో నిలిచినా హీరో జై మరో సారి వార్తల్లోకి ఎక్కాడు. జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన యువ హీరో జై ఎక్కువగా అంజలితో ప్రేమాయణం వార్తలతో వార్తలలో నిలుస్తూ ఉండేవాడు. అంజలి జైకి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడం, జై అంజలికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తుండడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే అభిప్రాయం అందరిలోనూ ఉండేది. తాజాగా అంజలికి, తనకి మధ్య ఉన్నది స్నేహమే తప్ప మరొకటి కాదని త్వరలో వేరే అమ్మాయిని వివాహం చేసుకోనున్నట్టు చెప్పి షాకిచ్చిన ఈ హీరో ఇప్పుడు తాను ఎప్పుడో మతం మారానని కూడా చెప్పి షాకిచ్చాడు. ఏడేళ్ళుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నానన్న జై దీనిని మా ఇంట్లో ఎవరు అడ్డుకోలేదని అన్నాడు. ఏ దేవుడిని నమ్మక పోవడం కంటే, ఏదొక దేవుడిని నమ్మడం వారికి సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు. అంతే కాదండోయ్ త్వరలో తన పేరు అజీస్ జైగా మార్చుకోవాలని కూడా అనుకుంటున్నాడట.