English   

ఆ ప్రకటన ఫేక్...చిరంజీవి మరో ప్రకటన

Chiranjeevi
2019-12-23 13:48:24

చిరంజీవి జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు ప్రకటించలేదని అది ఫేక్ లెటర్ అని అంటూ చిరంజీవి అభిమానులు తమ అభిమాన నేతను కవర్ చేసుకునే పనిలో పడ్డారు. వారికి చేతనయినంతగా చిరంజీవి విడుదల లెటర్‌ను ఫేక్ అని అది వైసీపీ సృష్టి అని ప్రచారం చేసేందుకు ప్రయత్నించడమే కాక నిన్న ఏకంగా ఒక ఫేక్ లెటర్ కూడా స్ప్రెడ్ చేశారు. ‘యావత్ ఆంధ్ర ప్రజానీకానికి సవినయంగా తెలియజేయునది... ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుని సమర్థిస్తూ గానీ, వ్యతిరేకిస్తూ గానీ నేను ఏ విధమైన ప్రకటన చెయ్యలేదు. తెలుగు ప్రజలకు చేరువచేసి, నన్నింతవాణ్ణి చేసిన సినిమా రంగం మీదే నా దృష్టి ఉంది. దయచేసి అందరూ గమనించగలరు’ అని చిరంజీవి పేరిట, ఆయన సంతకంతో సహా ఒక లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే దీనిపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. రాజధానులను సమర్థించినట్లుగా శనివారం విడుదల చేసిన ప్రకటన మాత్రమే వాస్తవమని, ఆదివారం (22 డిసెంబర్ 2019) వచ్చిన ప్రకటన అవాస్తవమని మీడియాకి సమాచారం అందించారు.  ఈ మేరకు ఒక వాయిస్‌ మెసేజ్‌ను విడుదల చేశారు. తెల్లకాగితంపై తన పేరిట వచ్చిన ప్రకటన అవాస్తవమని, ఫేక్‌ అని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా చేసిన ప్రకటనకే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. మరి దీనికి మెగా అభిమానులు ఏమని సమర్ధించుకుంటారో చూడాలి.

More Related Stories