మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న కాజల్...ప్రియుడితోనా

అందాల భామ కాజల్ అగర్వాల్ మాల్దీవుల్లో హాలీడేను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో కమలహాసన్-శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న ఇండియన్–2 సినిమాలో నటిస్తోంది ఆమె. ఆ సినిమా కాక హిందీలో జాన్ అబ్రహాంతో జతకట్టిన ముంబై సాగా చిత్ర షూటింగ్ పూర్తి అయిపొయింది. ఈ రెండు సినిమాలు కాక ఆమె చేతిలో మరో సినిమా లేకపోవడంతో ఆమె హాలిడే ఎంజాయ్ చేస్తోంది. అలా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ తీసుకున్న కొన్ని ఫొటోలను తాజాగా కాజల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సెగలు పుట్టిస్తున్నాయి. దీనికి కారణం ఈ ఫొటోల్లో కాజల్ బికినీలో ఉండటం. అక్కడితో ఆమె ఆగక బికినీలో బొమ్మ హంసపై స్విమ్మింగ్ పూల్లో సవారీ చేస్తూ ఫొటోలను పోస్ట్ చేయడంతో ఆమె నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఇక ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం ఈ భామ ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త ప్రేమలో పడినట్లు, త్వరలో అతనితో ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆమె తన ప్రేమికుడితోనే జాలీగా చక్కర్లు కొడుతోంది అని అంటున్నారు. ఇప్పటి వరకూ కాజల్ ప్రేమలో పడ్డట్టు ప్రచారం జరుగుతుందే గానీ, అతని ఫొటో ఎక్కడా బయటకు రాలేదు.