English   

ప్రతిరోజు పండగే...మూడో రోజు పెరిగిన కలెక్షన్స్ 

Prati Roju Pandaage
2019-12-23 15:11:20

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రతిరోజూ పండగే. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి తొలిరోజే మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే అనుకున్నంత గొప్పగా మాత్రం ఓపెనింగ్స్ రాలేదు. అయితే అదే రోజున రిలీజ్ అయిన రూలర్ సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో పాటు ఈ సినిమా బాగుందని మౌత్ టాక్ మంచిగా జనాల్లోకి వెళ్ళడంతో ఈ సినిమా కలెక్షన్స్ పుంజుకున్నాయి. అది కూడా మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ ఉండచ్చని చెబుతున్నారు. ఎందుకంటే మూడో రోజైన ఆదివారం సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్లన్నీ ఇంచుమించుగా హౌస్‌ఫుల్ అయిపోయాయి. దీంతో తొలిరోజు కన్నా మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు కలిపి ఈ సినిమా సుమారు ఆరు కోట్ల షేర్‌ వసూలు చేసిందని సమాచారం. గ్రాస్ రూ.15 కోట్ల వరకు ఉండి ఉండవచ్చని అంటున్నారు. మూడో రోజు కలెక్షన్లు బాగా పుంజుకున్నాయి కాబట్టి మూడు రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్ల వరకు షేర్ రాబట్టడం ఖాయమని భావిస్తున్నారు.  

More Related Stories