English   

సరిలేరు నీకెవ్వరు ఆంథమ్‌...గూజ్ బంప్స్ అంతే

mb
2019-12-23 19:01:24

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంతో సంక్రాంతి విడుదలకు ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తోన్న దేవీ శ్రీ ప్రసాద్ ప్రస్తుతం బీజీఎం రికార్డింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమా ఆంథమ్ రికార్డింగ్ కోసం ఆయన యూరప్ వెళ్ళిన ఆయన అక్కడ ప్రముఖ ఫేమ్స్ ప్రాజెక్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి ఈ ఆంథమ్‌ను రికార్డు చేశారు. ఆ ఆంథమ్‌ ను కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశారు. సైనికుల కష్టాన్ని, వారి త్యాగాల్ని గుర్తు చేస్తూ రూపొందించిన ఈ పాట మనసులు కదిలించే విధంగా ఉంది. శంకర్‌ మహదేవన్‌ పాటను పాడుతున్న విజుయల్స్ తో రూపొందించిన ఈ సాంగ్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ ఎత్తున విడుదల కానుంది. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా స్పెషల్ సంగ్ లో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి మీరు కూడా ఈ ఆంథమ్‌ వినేయండి.

 

More Related Stories