English   

తమిళ హిట్ డైరెక్టర్ తో చరణ్

charan
2019-12-24 05:06:33

ఖైదీ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు తమిళ విజయ్‌. విజయ్‌ సేతుపతి ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా, బిగిల్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేయటం ఖాయం అని భావిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 వేసవికి రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది కాక రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా లోకేష్ కనగరాజ్ మరో సినిమా మొదలు పెట్టాడు. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు కాక ఆయన తెలుగులో మరో సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఏమిటి అనే దాని మీద క్లారిటీ లేదు. ఎందుకంటే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు కానీ వంశీ పైడిపల్లి మహేష్ తో సినిమా చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఈ తమిళ దర్శకుడుతో రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అయితే మరి ఇప్పటికే రజనీకాంత్ తో సినిమా ఒప్పుకుని ఉండడంతో ఈ న్యూస్ ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది.  

 

More Related Stories