English   

మెగాస్టార్ ఇంటికి సూపర్ స్టార్...పుణ్యం పురుషార్ధం రెండూనూ

mbchiru
2019-12-24 05:27:32

మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ త‌న‌లోని కొత్త టాలెంట్‌ని ఇటీవ‌లే వెలికి తీసారు. ఎప్ప‌టి నుండో వైల్డ్ ఫోటోగ్ర‌ఫీని చాలా ఇష్ట‌ప‌డే రామ్ చ‌ర‌ణ్ వ‌న్య‌పాణుల ఫోటోలు తీసి వాటిని త‌న ఇంట్లో వాల్ ఫోటోలుగా అలంక‌రించాడు. అక్కడితో ఆగక కొత్తగా నిర్మించిన ఇంట్లో 'వైల్డెస్ట్ డ్రీమ్స్' పేరుతో ఒక సెపరేట్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసాడు. WWF ఇండియా సాయంతో రామ్ చరణ్ ఏర్పాటు చేసిన ఫోటోగ్ర‌ఫీ ఎగ్జిబిష‌న్‌ని తిల‌కించేందుకు సెల‌బ్రిటీలు చెర్రీ ఇంటికి క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీతో పాటు మంచు ల‌క్ష్మీ, స‌మంత, నాగ్ ఫ్యామిలీ హాజరుకాగా రీసెంట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత కూడా చెర్రీ ఇంటికి వచ్చి ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అక్కడ వారు దిగిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చెర్రీ తీసిన ఫోటోలు చూసి మహేష్ నమ్రతలు ప్ర‌శంస‌లు కురిపించారట.  త్వరలో జరుగనున్న మహేష్ `సరిలేరు నీకెవ్వరు` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఈవెంట్ కి చరణ్ ని చీఫ్ గెస్ట్ గా పిలవాలనుకుని చివరకు చిరంజీవిని పిలిచారనే ప్రచారం ఉంది.
ఆ విషయం పక్కన పెడితే  మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్, తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ఆసక్తికర ఫోటోని పోస్ట్ చేసారు. ఆ ఫొటోలో ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నట్లు గమనించవచ్చు. అయితే ఆమె పెట్టిన ఫొటోలో ఆ ఇద్దరు నటుల పేస్ లు కనపడకపోయినప్పటికీ వారిద్దరూ మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు అని మనలో చాలా మందికి అర్ధం అవుతుంది. అయితే చెర్రీ ఎగ్జిబిషన్ కోసం వెళ్ళిన మహేష్ చిరుతో కూడా మంతనాలు జరిపారన్నమాట. 'ఒకే విధమైన ఆలోచనలు కలిగిన ఇద్దరు వ్యాక్తుల కలయిక ఒక హిస్టరీ కి దారి తీస్తుంది', మీ అందరు జనవరి 5న ఆ రోజు కోసం వెయిట్ చేయండి అంటూ ఆమె పోస్ట్ చేసారు. 

More Related Stories