English   

బాలయ్యకి అవమానం...వచ్చే సారయినా

nbk
2019-12-24 05:37:10

ఒక స్టార్‌ హీరో ఏడాదిలో మూడు సినిమాలు రిలీజ్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అలాంటిది మూడు సినిమాలు రావడం అందులో మూడూ ఫ్లాప్‌లు రావడమంటే మాటలు విషయం కాదనే చెప్పాలి. ఆ హీరో ఎవరో కాదు నందమూరి బాల కృష్ణ. ఈ ఏడాది ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండు భాగాలతో విడుదల కావడం వల్ల బాలకృష్ణకి రూలర్‌తో కలిపి మొత్తం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయని చెప్పాలి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ మొదటి భాగం ఓపెనింగ్‌స్ బాగా వచ్చినా ఆ సినిమా ఫైనల్ రన్ వరకు నిలవలేక పోయింది. రెండో భాగం బాగా ఆడుతుంది అనుకుంటే అది ఏమో రెండు కోట్ల షేర్‌ కూడా సాధించలేక చతికిల పడింది. ఇక ఈ రెండు సినిమాలు దెబ్బ వేయడంతో మూడి సినిమా ఆడుతుందని బావించారు. రూలర్‌ రెగ్యులర్‌ సినిమా కనుక బాలకృష్ణ మాస్ యాంగిల్ కోసం అయినా ఆ సినిమా చూసేస్తారని అలా చూడగా ఆ సినిమా హిట్ అవుతుందని భావించారు కానీ ఈసారి కూడా ఆ సినిమా దేబ్బెసింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ మొదటి భాగానికి వచ్చిన మొదటి రోజు వసూళ్లు మొత్తాన్ని రూలర్‌ ఫుల్‌ రన్‌ కూడా లో సాధించడం కష్టమంటున్నారని అంటున్నారు. ఒకే ఏడాదిలో హ్యట్రిక్‌ ఫ్లాప్‌లతో బాలకృష్ణకి ఈ సంవత్సరం పెద్ద దెబ్బ వేసిందని అంటున్నారు. వచ్చే సంవత్సరం అయినా బాలయ్యకి కలిసొస్తుందో లేదో ? అయితే ఇది మాత్రం బాలయ్యకి ఆయన మార్కెట్ కి అవమానం అనే చెప్పాలి.

More Related Stories