English   

దిల్ రాజు కాంపౌండ్ నుండి హీరో కూడా 

 Dil Raju
2019-12-24 15:21:38

ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుమీదున్న నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన ఆయన నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. టాలెంట్ ఉన్న దర్శకులను వెతికి పట్టుకొని మంచి సినిమాలు చేయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఆయనకి కుడిభుజంలా ఉంటూ ఆయన సక్సెస్ లో వెన్నుదన్నుగా నిలుస్తోన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కో- ప్రొడ్యూసర్ శిరీష్ ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ వర్క్ చూసుకుంటారు. ఈ మధ్య నిర్మాతగా మారో ఆయన సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఆయన తనయుడు ఆశిష్ ని హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా లాంఛ్ చేస్తున్నారు. గతేడాది రిలీజ్ అయిన ‘హుషారు‘ చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ సాధించింది. ఆ చిత్ర దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ఆశిష్ మొదటి సినిమాకి దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు. ఇక సినిమా టైటిల్ ని కూడా రౌడీ బాయ్స్ అని పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుందని అంటున్నారు. ఈ సినిమాకి ‘పలుకే బంగారమాయే’ అనే టైటిల్ ను అనుకుని దానికి ‘బొమ్మరిల్లు’లో అనే ట్యాగ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఏమయిందో ఏమో కానీ ఈ సినిమా టైటిల్ మార్చారని అంటున్నారు. 
 

More Related Stories