English   

చీరకట్టుతో రచ్చ రేపిన హరితేజ

 Hari Teja
2019-12-24 16:13:03

బుల్లితెర నటిగా కెరీర్ మొదలుపెట్టిన హరితేజ ఆ తరువాత యాంకర్‌గా, వెండితెర నటిగానూ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడ్డ హరితేజ ఆఫర్లు వచ్చిన తరువాత ఆమె దూసుకుపోతోంది. అ..ఆ సినిమాలో మంగమ్మగా ఫన్నీ క్యారెక్టర్‌లో కనిపించిన హరితేజ ఆ తరువాత బిగ్ బాస్ రియాల్టీ షోలో తళుక్కుమంది. బిగ్ బాస్ టైటిల్‌ను మిస్ చేసుకున్నప్పటికీ ఆ షోలో బుర్రకధ ద్వారా ద్వారా కావాల్సినంత గుర్తింపును సాధించింది. ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న హరితేజ  తాజాగా ప్రతిరోజు పండగే సినిమాలో తేజ్ పిన్నిగా నటించి టైమింగ్ తో మంచి పంచ్ లు వేసి మరీ మార్కులు కొట్టేసింది. మరో వైపు మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా నటించిన ఈ భామ తాజాగా చేసిన ఫోటోషూట్ లో ఆమె రచ్చ రేపింది. ఆ పిక్స్ మీరు కూడా చూడండి మరి.

More Related Stories