English   

మెగా హీరోకి జోడీగా బాలీవుడ్ భామ 

Varun Tej
2019-12-24 23:27:21

 బాలీవుడ్ లో సక్సెస్ అవ్వాలని భావిస్తున్న నార్త్ హీరోయిన్స్ కెరీర్ మొదట్లో ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించడం పరిపాటి. సౌత్ హీరోలలో ఫాంలో ఉన్న వారితో సినిమాలు చేయడం ఆ అనంతరం ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో బిజీ అవ్వాలని ఈ కాలం హీరోయిన్స్ స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. బాహుబలి తరువాత ఆ డోస్ మరింత పెరిగింది.  బాలీవుడ్ లో పెద్ద హీరోలతో నటించినా తమన్నా వంటి భామలు తెలుగులో స్పెషల్ సాంగ్స్ లాంటివి వచ్చినా ఏ మాత్రం మిస్ చేసుకోవడం లేదు. బాలీవుడ్ లో ఇటీవల దబాంగ్ 3 తో హాట్ టాపిక్ గా మారిన సాయి మంజ్రేకర్ టాలీవుడ్ ఛాన్సులపై ద్రుష్టి పెట్టినట్టు సమాచారం. గద్దలకొండ గణేష్’ చిత్రంతో విజయాన్ని అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఒక బాక్సర్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ‘దబంగ్ 3’ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించిన సాయి మంజ్రేకర్ తో సంప్రదింపులు జరిపారని చెబుతున్నారు. ఈమె ఎవరో కాదు మరాఠీ దర్శకనిర్మాత అయిన మహేష్ మంజ్రేకర్ కుమార్తె. నిజానికి వరుణ్ తేజ్ సరసన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ నటించనున్నారని వార్తలు వినిపించాయి. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories