English   

మహేష్, బన్నీ సినిమాలతో పోటీనే లేదట 

Entha Manchi Vadavura
2019-12-24 17:02:53

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి మొదలైపోయినట్టే. ఈ సంక్రాంతికి స్టార్ హీరోలు అల్లు అర్జున్‌, మహేష్ బాబులు సంక్రాంతి బరిలోకి దిగబోతున్నారు. మహేశ్‌ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్‌ ‘అల.. వైకుంఠపురములో..’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలకి తోడుగా తమిళ సూపర్ స్టార్ నటించిన దర్బార్, అలాగే నందమూరి హీరో నటించిన ఎంత మంచి వాడవురా సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. 

అయితే ఒకప్పక్క చూస్తే ముగ్గురు పెద్ద హీరోలు, ముగ్గురి మార్కెట్ ఎక్కువే. మరోపక్క చూస్తే నందమూరి కళ్యాణ్ రామ్ మార్కెట్ తక్కువ. అసలు ఇలాంటి సమయంలో ఈ మూడు పెద్ద చిత్రాల మధ్య చిన్న చిత్రంగా విడుదల అవుతున్న ఎంత మంచివాడవురా సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందనే అనుమానం అందరికీ ఉంది. కానీ ఈ సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న వర్షన్ మాత్రం వేరేలా ఉంది. ఆయన ఈ పోటీ విషయంగా స్పందిస్తూ అసలు ఆ సినిమాలు మాకు పోటీయే కాదని స్పష్టం చేశారు. తమది ఫ్యామిలీ జానర్ సినిమా అని సంక్రాంతి సినిమా అని పేర్కొన్న కాబట్టి పండుగ సమయంలో తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని చెబుతున్నారు. 2017లో సతీష్ డైరెక్ట్ చేసిన 'శతమానం భవతి' సంక్రాంతి సీజన్లోనై విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మరి ఈ ఏడాది ఏమవుతుందో చూడాలి మరి.  

More Related Stories