English   

జూనియర్ ఎన్టీఆర్ అలా ఎందుకు ఫిక్స్ అయిపోయాడు..

Jr NTR
2019-12-24 18:20:39

రాజమౌళి సినిమాతో ప్రస్తుతం ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈయన తర్వాత సినిమా ఏంటనేది కూడా ఆలోచించలేదు. ఎందుకంటే రాజమౌళి కనీసం ఆలోచించే సమయం కూడా ఇవ్వడు కాబ‌ట్టి. కానీ ఎన్టీఆర్ మాత్రం తర్వాత కూడా ఆలోచిస్తున్నాడు. ఈయన ఇప్పటి వరకు నటుడిగానే ఉన్నాడు కానీ ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నాడు. కొన్ని రోజులుగా ఈయన నిర్మాణం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు దానిపై పూర్తిగా ఫోకస్ చేయబోతున్నాడని తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ దీనిపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు దాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు జూనియర్. ఇందులో భాగంగానే తన ప్రొడక్షన్ హౌజ్ కు భార్గవ్ హరి ఆర్ట్స్ అనే పేరు కూడా ఖరారు చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. చిన్న కొడుకు భార్గవ్ రామ్.. తండ్రి హరికృష్ణ పేర్లు కలిసొచ్చేలా ఈయన తన నిర్మాణ సంస్థకు నామకరణం చేయబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నిర్మాతగా మారడం వెనక రామ్ చరణ్ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈయన చెప్పినందుకే ఎన్టీఆర్ సొంత నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాడని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈయన తన నిర్మాణంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు ప్రచారం అయితే జోరుగానే జరుగుతుంది. మరి దీనిపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలిక.

More Related Stories