English   

బన్నీ - సుకుమార్ ప్రాజక్ట్ నుండి ఇంటరెస్టింగ్ అప్డేట్

Allu Arjun Sukumar.jpg
2019-12-25 08:14:03

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అల వైకుంఠపురములో సినిమా తర్వాత బన్నీ మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో బన్నీ సినిమా ఉండబోతోంది. ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో మొదలయింది కూడా. రంగస్థలం చిత్రంలో 1980 కాలం నాటి విలేజ్ ని దింపేసిన సుక్కు బన్నీ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ ని టార్గెట్ చేశాడు. కధాపరంగా ఈ సినిమాలోని ఎక్కువ సన్నివేశాలు ఫారెస్ట్ లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం సుకుమార్ ప్రత్యేకంగా కొందరు ఆర్టిస్టులని అది కూడా పెద్దగా ముఖ పరిచయం లేని వారిని ఎంపిక చేసుకున్నారు. వారందరిని కేరళ తీసుకుని వెళ్లి టెస్ట్ షూట్ నిర్వహించారట.

విభిన్నమైన కథ, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో షూటింగ్ ప్రారంభించడానికి ముందే సుక్కు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా కూడా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది.

More Related Stories