English   

విజయ్ క్రిస్మస్ ఆఫర్...ఏమడిగినా ఇచ్చేస్తాడట 

vijay devrakonda
2019-12-25 12:39:49

ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ వేడుక్లలో మునిగిపోయింది. క్రిస్మస్ పండగను గ్రాండ్‌ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు జీసస్ ను నమ్మే వారు. ఇక ఇలాంటివి వస్తే మన టాలీవుడ్ స్టార్స్ ఆగుతారా ? అది కూడా దేన్నైనా ప్రమోషన్స్ కోసం వాడుకునే విజయ్ దేవరకొండ వంటి వాళ్ళు ఈ పండగను కూడా తన ప్రమోషన్స్ కు వాడుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా తన అభిమానులకు గిఫ్ట్స్ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు ఈ క్రేజీ స్టార్. క్రిస్మస్ సందర్భంగా ఎవరికి ఏం కావాలో కోరుకోవాలని అందులో కొన్నిటిని అయినా నిజం చేస్తానని ట్విటర్ వేదికగా తన అభిమానులను కోరారు విజయ్. తన నుంచి మీరేం కోరుకుంటున్నారో #DeveraSanta2019 అనే హ్యాష్ తయగ్ తో తనను కూడా ట్యాగ్ చేసి తెలియజేయాలని సూచించాడు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. విజయ దేవరకొండ ఆఫర్‌కి ట్విటర్‌లో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కొందరు తమకు సెల్‌ఫోన్ కావాలని అడగ్గా మరికొందరు రౌడీ బ్రాండ్ టీషర్ట్‌ గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇంకొందరైతే మీ నవ్వే మాకు పెద్ద గిఫ్ట్ అని ప్రేమ కురిపిస్తున్నారు. అయితే ట్రోల్స్ కూడా వస్తున్నాయి అనుకోండి. ఒక కిలో ఉల్లిపాయలు కావాలని యాటిట్యూడ్ తగ్గించుకో అంటూ. ఇక ఇలా క్రిస్మస్ సందర్భంగా అభిమానులకు గిఫ్ట్స్ ఇవ్వడం 2017లో ప్రారంభించారు విజయ్ దేవరకొండ. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సారి కూడా బహుమతులు ఇస్తానని చెప్పారు.  
 

More Related Stories