English   

పోలీస్ బాస్ గా విశ్వక్ సేన్...ఫస్ట్ లుక్ విడుదల 

Vishwak Sen
2019-12-25 12:54:30

'అ' మూవీతో నిర్మాతగా మారిన నాని తన రెండో సినిమా కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. వాల్ పోస్ట‌ర్ సినిమాస్‌పై కొత్త సినిమా రూపొందిస్తున్న‌ట్టు ఆ మధ్య అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన నాని సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు కూడా. ఫ‌ల‌క్‌నామ్ దాస్ ఫేమ్ విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొంద‌నున్న ఈ సినిమాకి 'హిట్' అనే టైటిల్ ఖరారు చేశారు. శైలేష్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో చిల‌సౌ ఫేమ్ రుహానీ శ‌ర్మ కథానాయిక‌గా నటిస్తోంది. వివేక్ సాగ‌ర్ సంగీతం అందించ‌నున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమాలో ఆయన విక్రం రుద్రరాజు అనే పోలీస్ సూపరింటెండెంట్ పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించింది సినిమా యూనిట్. అంతే కాక ఇది ఒక థ్రిల్లర్ అని హింట్ ఇచ్చేలాగా సినిమా పోస్టర్ తేల్చింది. ఇక కొత్త ఏడాది మొదటి రోజున ఈ సినిమా నుండి గ్లిమ్ప్జ్ విడుదల చేస్తామని మేకర్స్ పేర్కొన్నారు. ఇక హీరో నాని ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో 'వి' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు.

More Related Stories