English   

కీరవాణి పుత్రోత్సాహం...ఒక్క దెబ్బకి రెండు పిట్టలు

Mathu Vadalara
2019-12-25 13:00:22

టాప్ డైరెక్టర్‌, టాప్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్‌, రచయిత, లైన్‌ ప్రొడ్యూసర్‌, కాస్టూమ్‌ డిజైనర్‌ ఇలా రాజమౌళి ఫ్యామిలీ అంటేనే ఒక కంప్లీట్ ప్యాకేజ్. ఓ సినిమా తీయాలంటే డబ్బు ఒక్కటి పెడితే సరిపోతుంది వాళ్లకి. ఇప్పటిదాకా ఒక లోటు ఉండేది ఆ ఫ్యామిలీ నుండి నటులు లేరే అని. చిన్న పాత్రలు చేసి నవ్వించే ఒకాయన (సై లో జెనీలియా ఫాదర్ క్యారెక్టర్)తప్ప ఎవరూ లేరు. కానీ ఇప్పుడు ఈ లోటు కూడా తీరిపోయింది. నటుడు అనేవాడే లేడనుకుంటే ఏకంగా హీరోగా మారి ఆ లోటును భ‌ర్తీ చేయ‌డానికి వచ్చేశాడు శ్రీ సింహా కోడూరి. కీరవాణి వారసుడిగా ‘మత్తు వదలరా’ అంటూ వచ్చి తెలుగు సినిమా మత్తు వదిలించాడు. ఈ ఏడాది వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లాంటి సినిమా అది కూడా స్టార్ కిడ్స్ చేయడం అనే పాయింట్ తోనే ఫస్ట్ సక్సెస్ అయింది యూనిట్. రితేష్‌ రానా దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా అయినా ఎక్కడా అలా అనిపించలేదు. ఇక శ్రీ సింహా తొలి సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్ సినిమాలో హీరో పలికించాల్సిన అన్ని భావాలను అవలీలగా పలకించాడు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌కు నటనాపరంగా మరో హీరో దొరికాడని చెప్పాలి. ఇక ప్రస్తుతం కీరవాణి పూర్తిగా పుత్రోత్సహాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఒకే చిత్రంతో తన ఇద్దరు కుమారులు టాలీవుడ్‌ అరంగేట్రం చేసి ఆకట్టుకున్నారు. అంతే కాక అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. దీంతో కీరవాణి కుటుంబం డబుల్‌ హ్యాపీ అని చెప్పవచ్చు. నటుడిగా శ్రీసింహా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కాల భైరవలు తమ తొలి సినిమాతో రాజమౌళి కుటుంబానికి మరింత కీర్తి పెంచారు తప్ప ఎక్కడా మైనస్ మార్కులు తీసుకురాలేదు.

More Related Stories