ఇస్మార్ట్ హీరోతో మారుతి

సాయి తేజ్, రాశీ ఖన్నాజంటగా డైరెక్టర్ మారుతి తాజా సినిమా ప్రతిరోజూ పండగే. ఈ సినిమా మొన్న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై డీసెంట్ టాక్ తో దూసుకువెళ్తోంది. ఈ సినిమా విజయంతో మంచి కిక్ మీద ఉన్న మారుతి తన తర్వాత చిత్రాన్ని ఇస్మార్ట్ హీరో రామ్‌తో ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్న మారుతి చేతిలో ముగ్గురు నలుగురు నిర్మాతలు ఉన్నారట. దీంతో ఎవరో రామ్ తో సినిమా చేసే చేసే ఆలోచనలో మారుతి వున్నాడని అంటున్నారు. ఆల్రెడీ రామ్ తో మారుతి మాట్లాడటం జరిగిందనీ, త్వరలో రామ్ తో సంప్రదింపులు కూడా జరిపాడని చెబుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా చేయడం ఇదే మొదటి సారి. ఇక ఇస్మార్ట్ శంకర్ లాంటి అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్.. తన తదుపరి చిత్రాన్ని కిశోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు. తడం అనే తమిళ సినిమాకు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమా రెడ్ అనే పేరుతో తెరకెక్కుతోంది.