English   

మహేష్ అభిమానులకు గాయాలు.. ఈవెంట్‌లో తొక్కిసలాట.

Mahesh Babu
2019-12-25 17:20:01

మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు సూపర్ స్టార్. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఫోటోషూట్స్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు. మీ అభిమాన హీరోతో ఫోటో దిగండి అంటూ ఫోటో షూట్ ఏర్పాటు చేసారు ఏకే ఎంటర్ టైన్మెంట్స్. గచ్చిబౌలిలో ఈ ఈవెంట్ ప్లాన్ చేసారు మేకర్స్. అక్కడే అసలు రచ్చ జరిగింది.

మీరు వస్తే మహేష్ మీతో ఫోటో దిగుతాడు అంటూ నిర్మాతలు ప్రచారం చేయడంతో వచ్చిన క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. తొక్కిసలాట జరగడంతో ఇద్దరు అభిమానుల కాళ్లు కూడా విరిగాయి. గచ్చిబౌలిలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర హీరో మహేశ్‌బాబుతో ఫ్యాన్స్‌ ఫొటోషూట్‌ను ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. అయితే దీనికి సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు ఈవెంట్ మేనేజర్స్. దాంతో తొక్కిసలాట జరిగింది. చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గచ్చిబౌలిలో ఈ ఫొటోషూట్‌ను ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. 

ఫోటోలు దిగొచ్చని ఆన్ లైన్ లో పోస్ట్ చేయడంతో మహేష్ బాబు అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడికి వచ్చారు. అనుకున్న దాని కంటే భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. అక్కడ అంతా గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తమ కాళ్లు కూడా పోగొట్టుకున్నారు. దాంతో వెంటనే వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు వచ్చి ఈ ఫొటోషూట్‌కు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఫోటోషూట్ కూడా క్యాన్సిల్ చేసారు పోలీసులు.

More Related Stories