English   

బాలయ్య గారూ మీరు మారండి సర్ ప్లీజ్..

Nandamuri Balakrishna
2019-12-25 18:14:44

ఈ ప్రశ్న మనం అడుగుతున్నది కాదు అభిమానులే అడుగుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వస్తున్నాయి కానీ బాలకృష్ణలో మాత్రం మార్పులు రావడం లేదు అంటూ అభిమానులు నిట్టూరుస్తున్నారు. గత వారమే ఆయన నటించిన రూలర్ సినిమా విడుదలైంది. కె.ఎస్.రవికుమార్ తెరకెక్కిన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. బాలయ్య కెరీర్ లో మరో డిజాస్టర్ అయిపోయింది ఈ చిత్రం. కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేక చేతులెత్తేసింది రూలర్. 

టైటిల్లో ఉన్న పవర్ సినిమాలో లేకపోవడంతో ఏం చేయలేకపోతున్నాడు బాలయ్య. అసలు ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నావ్ బాలయ్య అంటూ ఫ్యాన్స్ ఆయన్ని నేరుగానే ప్రశ్నిస్తున్నారు. సినిమా అనుకుంటున్నపుడు కనీసం కథ అనేది ఒకటి ఉంటుంది కదా సర్ అంటూ సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ అంటూ మళ్లీ మళ్లీ అలాంటి సినిమాలే తీయడం ఏంటి బాలయ్య గారూ.. ఒక్కసారి ఆలోచించండి సర్ అంటూ బాలయ్యను విజ్ఞప్తి చేస్తున్నారు అభిమానులు. 

ఇందులో ఏ పాయింట్ చూసి బాలకృష్ణ ఈ సినిమా ఓకే చేసాడు అంటూ తలపట్టుకుంటున్నారు అభిమానులు. జై సింహా సినిమాలో కనీసం ఎమోషన్స్ ఉన్నాయి.. రొటీన్ కథే అయినా కూడా మాస్ ఆడియన్స్ ను మెప్పించే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కె.ఎస్.రవికుమార్. కానీ ఆ సినిమా ఇచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో కానీ రూలర్ సినిమాలో మాత్రం అవి ఏవీ కనిపించలేదు. పైగా సినిమాను ఇష్టమొచ్చినట్టు తీశాడు ఈ తమిళ దర్శకుడు. బాలకృష్ణ ఇమేజ్ తో ఆడుకున్నాడు. 

ఇప్పుడు ఇదే అభిమానులకు కాలిపోతుంది. తమ హీరోని వచ్చినట్లు చూపించాడు అంటూ కె.ఎస్.రవికుమార్ పై మండి పడుతున్నారు నందమూరి బాలకృష్ణ అభిమానులు. ఓపెనింగ్ సీన్ లోనే హెలికాప్టర్ పై నుంచి వేలాడటం.. మధ్యలో జబర్దస్త్ కమెడియన్ లతో వెకిలి కామెడీ చేయించడం.. తలా తోక లేని యాక్షన్ సన్నివేశాలు ఇవన్నీ చూసి ప్రేక్షకుల మాట దేవుడెరుగు అభిమానులు కూడా నిరాశ పడుతున్నారు. కనీసం వాళ్ల కైనా నచ్చేలా తీయడంలో కె.ఎస్.రవికుమార్ దారుణంగా విఫలమయ్యాడు అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా బాలకృష్ణ కథల ఎంపికలో తన పంథా మార్చుకోవాలని లేకపోతే ఇలాంటి దారుణమైన ఫలితాలే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి అంటున్నారు ట్రేడ్ పండితులు.

 ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమా కూడా రెగ్యులర్ కంటెంట్ తోనే వస్తుంది. బోయపాటి సినిమా అంటే కొత్తదనం అనేది ఉండదు. ఆయన కూడా మరోసారి మాస్ సినిమాతోనే వస్తున్నాడు. ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒకటి ఇప్పుడు.. మరొకటి పూర్వకాలం.. ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ కాకపోతే పరిస్థితేంటి అంటున్నారు ఫ్యాన్స్. మొత్తంగా బాలయ్య తీరు మార్చుకోకపోతే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. మరి ఈయన ఎంతవరకు పట్టించుకుంటాడో చూడాలిక.

More Related Stories