పవన్ కల్యాణ్ క్రిస్మస్ వేడుకలు అక్కడే.. భార్యతో కలిసి..

పవన్ కల్యాణ్ సర్వమత సౌభ్రాతృత్వాన్ని పాటిస్తున్నాడు. ఈయనకు కులమత బేధాలు అస్సలు లేవు. ఇప్పుడు కూడా ఈయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాడు. ఈయన తన భార్య అన్నా లెజెనోవాతో కలిసి రష్యాకు వెళ్లాడు. అక్కడే పండగ జరుపుకుంటున్నాడు ఈ జపసేనాని. ఈయన తన భార్యతో కలిసి రష్యాలో వెళుతున్న ఓ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఒకవైపు జగన్ మతమార్పిళ్లకు పాల్పడుతున్నాడని పదేపదే విమర్శిస్తున్న పవన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు రష్యా వెళ్లడంపై నెటిజన్లు మాత్రం విమర్శలు సంధిస్తున్నారు. తను ఇంట్లో సరిగ్గా ఉండడు కానీ బయటికి మాత్రం నీతులు చెప్తాడంటూ ఆయనపై విమర్శల వాన కురుస్తుంది. అయితే పవన్ భార్య అన్నా క్రిస్టియన్. అందుకే భార్యతో పాటే అక్కడికి వెళ్లాడని కొందరు చెబుతున్నారు. అందులో పవన్ తప్పేంటి అని అడుగుతున్నారు. స్వతహాగా భార్య క్రిస్టియన్ కావడంతో ఆమె మతాన్ని గౌరవిస్తున్నాడు అంటున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసి అత్తారింటికి పవన్ వెళ్లాడోచ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం పింక్ సినిమా రీమేక్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.