English   

నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్

ntr
2019-12-26 05:14:32

నందమూరి కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీష్‌ వేగేశ్న దర్శకుడిగా తెరకెక్కించిన ఈ సినిమాకి ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భాగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. కళ్యణ్ రామ్ ప్రస్తుతం శబ్ధాలయ స్టూడియోస్‌ లో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. త్వరలో అది పూర్తవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 5న లేదా జనవరి 6న జరిగే ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా ఎన్టీఆర్ రాబోతున్నట్లు తెలుస్తోంది.  గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడం అంటే అది నందమూరి అభిమానులకి కన్నుల పండుగ అనే చెప్పాలి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ బయట కనిపించలేదు. దీంతో ఇది వారికి పెద్ద వార్తే.

More Related Stories