English   

రవితేజ టైటిల్ తో గోపీ చంద్..వర్కౌట్ అవుతుందా?

Gopichand.jpg
2019-12-26 09:52:37

విజయం కోసం దండయాత్రలు చేస్తున్న హీరో గోపీచంద్ ఈసారి కూడా మరో విభిన్నమైన కథతో మన ముందుకు వస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమాకి “సీటీ మార్” అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. గోపీచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా కబడ్డీ నేపధ్యంలో ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ చిత్రంలో తమన్నా, గోపీచంద్ ఇద్దరూ, కబడ్డీ కోచ్ లుగా కనిపిస్తారట. గతంలో సంపత్ నంది గోపీచంద్ లతో కలిసి ‘గౌతమ్ నందా’ సినిమా చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఐనా మరోసారి హిట్టు కొట్టాలనే కసితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ‘యు టర్న్’ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. నిజానికి హరీష్ శంకర్ కూడా తన 'డీజే' సినిమాలో ఓ పాటలో వచ్చే 'సీటి మార్' అనే పదాన్ని సినిమాగా తీయాలనుకున్నారు.

హీరో ఎవరో చెప్పకుండానే టైటిల్ అనౌన్స్ చేసాడు కూడా. ఆ తర్వాత రవితేజను పెట్టి ఈ పవర్ ఫుల్ టైటిల్ తో సినిమా ప్లాన్ చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదు. కధకు సూట్ అవడంతో హరీష్ ను బ్రతిమిలాడి ఈ టైటిల్ తీసుకున్నాడట సంపద్ నంది. మరి ఈ టైటిల్ తో గోపీచంద్ కి ఎంత వరకూ కలిసొస్తుందో ? చూడాలి.

More Related Stories