ప్రతిరోజూ పండగే కలెక్షన్స్...నైజాంలో దుమ్మురేపుతున్నాడుగా

సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన తాజా మూవీ ప్రతి రోజూ పండగే. ఈ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై డీసెంట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా నైజాంలో సాయి తేజ్ కు తన కెరీర్ లోనే గుర్తుంచుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టింది. డీసెంట్ టాక్‌తో బాక్సాపీస్ ఓపెన్ చేసిన ప్రతిరోజూ పండగే మొదటిరోజు నైజాం ఏరీయాలో ఒక్క ఆరో రోజునే 1.25 కోట్ల షేర్‌ను రాబట్టింది.
సాయి తేజ్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ మొత్తం ఒక రికార్డు. ఈ సినిమాకి అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్లను వస్తున్నాయి. శుక్రవారం మొదటిరోజే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రోజులు గడిచే కొద్దీ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం నిజాంలో ఇప్పటి దాకా ఏడు కోట్ల దాకా షేర్ సాధించింది. ఈ సినిమా ఐదు రొజులకు గాను 14.6 8 కోట్ల షేర్ సాధించగా 26.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
ఇక మిగతా ఏరియాల కలెక్షన్స్ అందాల్సి ఉంది. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దాదాపు 800 స్క్రీన్స్‌లో విడుదలైంది. ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే చిత్రానికి రానురాను వసూళ్లు ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నారు.