English   

మెగా ఫ్యామిలీకి మారుతి బంధువు..

Maruthi
2019-12-26 14:06:30

తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమా అనేది చచ్చిపోతున్న సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు మారుతి. కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో ఈ రోజుల్లో అనే సినిమా తెరకెక్కించి సంచలన విజయం అందుకున్నాడు మారుతి. ఆ తర్వాత బస్ స్టాప్ సినిమా తీసి మరో సంచలనం సృష్టించాడు. అయితే ఈ రెండూ బూతు సినిమాలుగా ముద్ర వేయించుకోవడంతో మారుతికి విజయం సాధించినా కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. ప్రేమ కథ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని ఆ తర్వాత తానేంటో నిరూపించుకున్నాడు మారుతి. ఆ వెంటనే అల్లు అరవింద్ తన చిన్న కొడుకు అల్లు శిరీష్ బాధ్యతలు అప్పగించాడు. కొత్తజంట అంటూ యావరేజ్ సినిమా తీశాడు మారుతి. 

అయితే ఈయనకు మెగా కుటుంబంతో మంచి అనుబంధం ఉంది అని చాలా రోజుల నుంచి అందరికీ తెలిసిందే. కానీ దాని వెనుక మరో కారణం కూడా ఉంది. నిజానికి అల్లు అరవింద్ కుటుంబానికి మారుతీ బంధువు అవుతాడని ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ మధ్య ఒక టెలివిజన్ షో కు వచ్చిన మారుతి అక్కడ అసలు విషయాన్ని బయట పెట్టాడు. అల్లు అరవింద్ భార్యకు తాను చుట్టాన్ని అవుతారని చెప్పాడు మారుతి. అప్పట్లో ఆ పరిచయంతోనే అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ తో పరిచయం అయ్యిందని.. వాళ్ళింట్లోనే సొంత మనుషుల తిరిగేవాడిని అని చెప్పుకొచ్చాడు మారుతి. ఆ తర్వాత దర్శకుడు కావడం చిరంజీవి ప్రోత్సాహం ఉండటం.. అల్లు అరవింద్ ఎప్పుడూ వెంటే ఉండి తనను నడిపించడం జరిగాయని గుర్తుకు తెచ్చుకున్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన ప్రతి రోజు పండగే సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ విజయోత్సాహంలోనే ఉన్నాడు మారుతి. 

More Related Stories