English   

నాగశౌర్య అశ్వద్దామ స్టోరీ...ఆ ఘటన గురించే 

 Naga Shaurya
2019-12-26 14:18:20

నాగశౌర్య హీరోగా తన సొంత బ్యానర్‌ ఐరా క్రియేషన్స్‌లో రూపొందుతోన్న సినిమా 'అశ్వత్ధామ'. మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాని రమణ తేజ అనే నూతన దర్శకుడు తెరకేక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి కధ నాగశౌర్యనే అందించడం గమనార్హం. ఇప్పటి వరకు సినిమాలు చేసిన అనుభవంతో పాటు తన సొంత బుర్ర పెట్టి ఈ సినిమా కథని ప్రిపేర్‌ చేశాడు నాగశౌర్య. 'అశ్వత్ధామ' అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ పెట్టాడు సినిమాకి. పక్కా యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద నాగ శౌర్య చాలా నమ్మకం పెట్టుకున్నాడు. 

ఎంతగా అంటే ఈ సినిమా పేరు తన గుండెల మీద చేక్కించుకునేంతగా. ఈ సినిమాకి యాక్షన్‌ ఎపిసోడ్స్‌ హైలైట్‌ అవుతాయని ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమాలోని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరించారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమా కధ మొన్న జరిగిన దిశ ఘటనకు దగ్గరగా ఉంటుందట. హీరో సోదరి మీద కూడా హత్యాచారం జరుగుతుందట. దీంతో పగబట్టిన హీరో ఇలా ఆడపిల్లల మీద జరుగుతున్న హత్యాచారాలు ఎన్నో ఉన్నాయని తెలుసుకుంటాడు. దీంతో ఏమి చేశాడు అనేది కీలకంగా ఉండనుందట. జనాలు ఇప్పుడు ఈ విషయం మీద చాలా కోపంగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఆడపిల్లల మీద సబ్జెక్ట్ తీసుకువస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు చెబుతున్నారు. దిశ ఘటన తర్వాత సినిమా కధలో కొన్ని మార్పులు కూడా చేశారట. మరి ఇందులో నిజం ఎంత ఉంది అనేది తెలియాలి అంటే వచ్చే నెల 31 వరకూ ఆగాల్సిందే.

More Related Stories